About Telugu Sangamam

మధ్యప్రదేశ్ లో నివశిస్తున్న తెలుగు ప్రజల మధ్య పరస్పర సంబంధాన్ని ఏర్పరచుకోవడం మరియు అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఇటీవల, ఈ గ్రూప్ ద్వారా తొమ్మిది మంది తెలుగు వారికి తమ అర్హతలను బట్టి భోపాల్ లో ఉద్యోగాలు పొందడంలో సహాయ పడటం జరిగింది.

ఇలా అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం కోసం ఈ గ్రూప్ ని ఉపయోగించవలసిందిగా అందరినీ కోరుతున్నాము.

అలాగే మన తెలుగు వారెవరైనా ఉద్యోగాల కోసం వెతుకుతున్నట్లయితే వారి బయోడేటా ని సేకరించేందుకు ప్లాన్ చేస్తున్నాం, తద్వారా ఒకరికొకరు తెలిసిన వారిద్వారా వారికి ఉద్యోగం పొందడంలో సహాయపడవచ్చు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు వారందరికీ నమస్సుమాంజలి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది తెలుగువారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇందులో చాలామంది ఇదే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిపోయారన్నది అందరికీ తెలిసిన విషయమే భోపాల్ పట్టణంలో ఇప్పటికే రెండు తెలుగు సమాజాలు ఉన్నప్పటికీ అవి కేవలం భోపాల్ నగరానికి మాత్రమే చెందినవి ఇండోర్ గ్వాలియర్ జబల్పూర్ చిన్వాడ ఇంకా వేరువేరు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అవి ఆయా ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనవి. ఏ సమాజం కూడా పూర్తిగా మధ్యప్రదేశ్ లోని తెలుగు వాళ్ళ అందరిని కూడా కవర్ చేస్తూ ఏ కార్యక్రమాలు నిర్వహించడం కూడా వీలు పడడం లేదు. మొత్తం మధ్యప్రదేశ్లోని విభిన్న కుల మతాలకు చెందిన ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అంటే కులమతాలకు అతీతంగా ఒకే తాటిపైకి అందర్నీ తీసుకురావాలనే సంకల్పంతోనే తెలుగు సంఘం మధ్యప్రదేశ్ అనే సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ కార్యకలాపాల్లో సభ్యులందరికీ కూడా సమానమైన ప్రాధాన్యత లభిస్తుంది. కేవలం భక్తి పరమైన కార్యక్రమాలే కాకుండా మన సంస్కృతికి సంబంధించిన విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తూ మన సాంప్రదాయాలను అనుసరించి పండుగలు జరుపుకుంటూ మన రీత్రీవాదుల గొప్పతనాన్ని మిగిలిన భాషల వారికి కూడా తెలియజేస్తూ మనకి సహకరించే ఆయా భాషల వారితో సామరస్యంగా ఉండాలని ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. విద్యా వ్యాపారం ఉద్యోగం ఇలా వేర్వేరు పనుల కోసం వచ్చిన తెలుగు వారికి మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తూ వాళ్లకి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం మన సంస్థ కార్యక్రమాల్లో ప్రధానమైనది.

ఇకపోతే ఇక్కడ స్థిరపడిన తెలుగు వారందరికీ వారి పిల్లల పెళ్లి సంబంధాల విషయంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అందువలన వాళ్ళకవసరమైన సమాచారాన్నందించడం, అలాగే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అర్హత కలిగిన యువత ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన పట్నం కావచ్చు మధ్యప్రదేశ్ లోని విభిన్న ప్రాంతాల్లో వాళ్ళు కావచ్చు. సంస్థల్లో అంటే పరిశ్రమల్లో అవొచ్చు లేకపోతే ప్రభుత్వ సంస్థల్లో అవొచ్చు, పనిచేస్తున్న ఉన్నతాధికారుల సహకారంతో స్థానిక సంస్థల్లో పరిశ్రమల్లో ఇంకా రాష్ట్రంలోని పరిశ్రమల్లో వేరు వేరు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు సహకరించడం ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వాళ్ళకి మన సంస్థ ఒక ప్రచారం మాధ్యమంగా ఉండడం. అంటే వాళ్లకు సంబంధించిన ఏవైతే ప్రకటనలు ఇలాంటివన్నీ కూడా మన సంస్థ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో ఉంది రేపు పొద్దునిది ఫేస్బుక్ కి అవ్వచ్చు ఇంకొంచెం ఎదిగిన తర్వాత, ఒక వెబ్సైట్ కూడా పెట్టుకోవచ్చు మనం వీటన్నిటిలో కూడా మనం మన చిన్న వ్యాపారాలు ఎవరివైతే ఉన్నాయో వాళ్ళ ప్రకటనలు అందులో పెట్టి, వాళ్ళను ఎదిగేలా చేయడం. ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో మన సంస్థ చేయబోయే పనులని అందరికి తెలియజేస్తుంది. అత్యవసర పరిస్థితిలో సహాయం అందించడానికి సంస్థతో అనుబంధం వున్నా వేరే సంస్థలు ద్వారా, వ్యక్తుల ద్వారా మన సంస్థ ముందడుగు వేస్తుందని తెలుగువారంతా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు పోటీ ప్రపంచంలో కాలంతో పరుగులు పెడుతున్న మనం, మన ప్రాచీన కళలను కళారూపాలను విస్మరిస్తున్నాం. ఆ కళలే జీవనాధారమైన కళాకారులను ఆదుకోలేకపోతున్నాం. అలాంటి కళాకారులు, సాహిత్య కార్లకు చేయూతనిస్తూ విభిన్న సాంస్కృతి కార్యక్రమాలు, వినోధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మన వాళ్లందరికీ, వినోదాన్ని పంచడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. అందరికీ మరోసారి తెలియజేసింది ఏంటంటే రాష్ట్రంలో లేదా మనదేశంలో లేదా విదేశాల్లో ఉన్న తెలుగు వారికి నిస్వార్ధంగా సేవలందిస్తున్న ఏ సంస్థతోనైనా చేతులు కలిపి నిరంతరం ముందుకు సాగుతుంది.

ఇన్ని మహత్తరమైన ఉద్దేశాలతో ప్రారంభించిన ఈ సంస్థ అభివృద్ధి చెందడానికి మీరంతా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం.